జగన్-కేసీఆర్ కుమ్మక్కయ్యారు
తెలుగు రాష్టాల మధ్య నీళ్ల లొల్లి మొదలైన సంగతి తెలిసిందే. ప్రతిరోజు 3 టీఎంసీల నీళ్లను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం జీవోనుని జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ నే తెలిపారు. ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ల మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇస్తారని.. నీళ్ల లొల్లి తెస్తారని ఎవరు ఊహించలేదు.
అయితే సీఎంలు ఇద్దరు కుమ్మక్కు అయ్యారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కృష్ణ జలాల నిధుల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఉద్యమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్వార్ధ రాజకీయాలతో లక్ష్యం నెరవేరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 టీఎంసీల నీళ్లను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం జీవోను 5వ తేదీన విడుదల చేస్తే తెలంగాణా ప్రభుత్వం ఆలస్యంగా స్పందించింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుమ్మక్కు అవుతున్నారని విమర్శించారు.