రానా పెళ్లిపై నాని జోక్

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుపాటి ఓ ఇంటివాడుకాబోతున్న సంగతి తెలిసిందే. మంగళవారం రానా తన ప్రేయసిని పరిచయం చేశాడు. ‘ఆమె ఓకే చెప్పేసింది’. ఆమె పేరు మిహికా బజాజ్ అంటూ ఫోటో షేర్ చేశాడు. దీంతో.. మెగాస్టార్ చిరంజీవితో పాటు.. టాలీవుడ్ ప్రముఖలంతా రానాని శుభాకాంక్షలు తెలిపారు. 

కాస్త ఆలస్యంగా నేచురల్ స్టార్ నాని కూడా రానాని విష్ చేశారు. ఈ సందర్బంగా ఫేమస్ బజాజ్ యాడ్ వీడియోని షేర్ చేశాడు. ‘ఇంకా ఏమేమి చూడాల్సివస్తుందో 2020 లో’. సూపర్ బాబాయ్.. అంటూ కామెంట్ పెట్టాడు నాని. అయితే నాని షేర్ చేసిన బజాజ్ లింక్ మాత్రం నవ్వులు పూయిస్తోంది.