అప్పటి వరకు నో షూటింగ్స్ !

కరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 25 నుంచి షూటింగ్స్ లేవ్. థియేటర్స్ బంద్. అయితే ఇప్పట్లో థియేటర్స్ తెరచుకొనే అవకాశం లేకపోయినా.. షూటింగ్స్ కి మాత్రం త్వరలోనే అనుమతి లభిస్తుందని ఆశించారు. మూడో విడత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా పలు రాష్ట్రాలు షూటింగ్స్ కి షరతులతో కూడిన అనుమలు ఇచ్చారు.
 
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే షూటింగ్స్ అనుమతి ఇవ్వనుంది. ఈ నెల 18 నుంచి సినిమా, సీరియల్స్ షూటింగ్స్ మొదలవుతాయని ఆశించారు. అయితే వారి ఆశలు, అంచనాలని తలక్రిందులయ్యాయి.  తెలంగాణలో అలాంటి మినహాయింపు ఏమి లేదని.. మే 29 వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జూన్1 నుంచి మాత్రమే షూటింగ్స్ కి అనుమతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.