పవన్ టైటిల్ ‘ఇప్పుడే మొదలైంది’ ?

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దశాబ్దాల ఇండస్ట్రీ రికార్డులని బ్రేక్ చేసింది. అసలు సిసలు మాస్ హిట్ అంటే ఏంటో రుచి చూపించింది. పవన్ అభిమానులకి జీవితకాలం గుర్తిండిపోయే సినిమాగా నిలిచింది. అలాంటి పవన్-హరీష్ శంకర్ కాంబోలో మరో సినిమా అంటే.. అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో.. ఊహించుకోవచ్చు. 

‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్.. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ సినిమా ఉండనుంది. ఇది కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ హీరోయిన్ మానసా రాధాకృష్ణన్ పేరు వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కోసం  “ఇప్పుడే మొదలైంది” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని సమాచారమ్. గబ్బర్ సింగ్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. ఇంట్రెవెల్ ఏపీసోడ్ లో వచ్చే ఈ డైలాగ్.. సెకాంఢాఫ్ రేంజ్ ని తెలిపేలా ఉంటుంది. ఇప్పుడిదే డైలాగ్ ని పవన్ సినిమా టైటిల్ గా పెట్టినట్టు తెలుస్తోంది.