సుధీర్’తో మంచి బంధం ఉంది : రష్మీ
సుధీర్-రష్మీ ల కెమిస్ట్రీ గురించి తెలిసిందే. తెరపై ఈ జంట జీవించేస్తుంటుంది. దీంతో నిజ జీవితంలోనూ ఈ జంట కలిసి బతకపోతుందనే ప్రచారం జరుగుతోంది. మా మధ్య ఏం లేదు. మేం స్నేహితులం మాత్రమేనని ఎన్ని సార్లు రష్మీ, సుధీర్ క్లారిటీ ఇచ్చినా.. వీరి బంధంపై పుకార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా లాక్‌డౌన్ కారణంగా హోమ్ క్వారంటైన్‌లో ఉన్న రష్మిని తాజాగా ఓ వెబ్‌సైట్ వారు ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా రష్మి.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
“నేనూ సుధీర్ నటీనటులం మాత్రమే. స్ర్కిప్ట్‌కి అనుగుణంగా, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు మేమిద్దరం ఉత్తమమైన ప్రదర్శన కనబరుస్తుంటాం. నిజ జీవితంలో మేమిద్దరం గొప్ప స్నేహితులం కూడా కాదు. కాకపోతే మా ఇద్దరి మధ్య ఓ మంచి బంధం ఉంది. అంతే తప్పా అంతకు మించి ఏమీలేదు” అని రష్మీ చెప్పుకొచ్చింది. రష్మీ ఎన్ని అయినా.. చెప్పని ఆమెని సుధీర్ తో లింకుపెట్టి రాతలు రాయడం మాత్రం గాసిప్ రాయుళ్లు మానుకునేలా లేరు.