కేసీఆర్ చెప్పిందే.. కేంద్రం చేసింది.. జూన్ 30 వరకు రైళ్లు రద్దు !

భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు పాసింజర్ రైళ్లని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మూడో విడత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా పాసింజర్ రైళ్లకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులు ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల అన్నీ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా రైళ్లని నడపడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

రైళ్లని నడపడం మంచి కాదు. వాటిని మరికొన్నాళ్లు నడపకపోవడమే మంచింది. ఎందుకంటే ? ప్రయాణికులని క్వారంటైన్ చేయలమని సీఎం కేసీఆర్ ప్రధానికి వివరించారు. అయితే అప్పటికే రైళ్ల రాకపోకలకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచనని కేంద్రం పట్టించుకోదేమో అనుకున్నారు. కానీ, తాజాగా జూన్ 30 వరకు రైళ్లని రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. అంటే.. ? జూన్ 30 వరకు దేశంలో లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉందన్నమాట.