నిఖిల్ పెళ్లి వీడియో

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో డాక్టర్ పల్లవి వర్మని.. నిఖిల్ వివాహమాడాడు. ఈ ఉదయం 6:30 గంటలకి శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. కొద్ది మంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. నిఖిల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియోలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

‘పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వీనీ పెండ్లి కూతురు’ అంటూ నిఖిల్‌, పల్లవిలు తలంబ్రాలకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిఖిల్‌, పల్లవిల వివాహానికి సంబంధించిన ప్రతి వీడియో ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక కరోనా ప్రభావం ముగిశాక నిఖిల్ పెళ్లి రిసెప్షన్ పార్టీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.