వైరల్ : నిఖిల్ పెళ్లి ఫోటోలు

యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రియురాలు పల్లవి వర్మని పెళ్లాడారు. ఈ ఉదయం 6:30 గంటలకి శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. కొద్ది మంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. అయితే పెళ్లి ఫోటోలని మాత్రం అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు.
 
నిఖిల్‌, పల్లవిల వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్‌డౌన్ నిబంధనలని పాటిస్తూ నిఖిల్ వివాహ వేడుక జరిగిందని ఫోటోలని చూస్తే అర్థమవుతోంది. ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా పెళ్లి వేడుకని పూర్తి చేశారు. నిఖిల్-పల్లవి వర్మల పెళ్లి ఫోటోలని మీరు చూసేయండీ.. !