హెచ్ఐవీ తరహా కరోనా ఉండిపోవచ్చు : WHO

మహమ్మారి కరోనా వైరస్ కి వాక్సిన్ ని కనిపెట్టే పనిలో ప్రపంచదేశాలు ఉన్నాయి. ఈ యేడాది చివరికల్లా, అంతకంటే ముందే కరోనాకి వాక్సిన్ రావొచ్చని చెబుతున్నారు. అయితే వాక్సిన్ వచ్చినా.. కరోనా ముప్పు ఎప్పటికీ  తొలగిపోదేమోనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అభిప్రాయపడింది.

తాజాగా జెనీవాలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డబ్ల్యూహెచ్ వో ఆత్యయిక పరిస్థితుల విభాగం డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడారు. టీకా అందుబాటులోకి వచ్చినా కొవిడ్ ముప్పు ఎప్పటికీ తొలగిపోదేమోనన్నారు. హెచ్ ఐవీ తరహాలో ఈ విలక్షణ మహమ్మారి మానవాళితో ఉండిపోయే అవకాశముందన్నారు. ప్రస్తుతం 100కుపైగా కరోనా టీకాలు అభివృద్ధి దశలో ఉన్నాయని.. అయితే, టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ తట్టు వంటి వ్యాధుల ముప్పు పూర్తిగా తొలగిపోలేదని గుర్తుచేశారు.