త‌గ్గిన హ‌త్య‌లు…! పెరిగిన రేప్ లు, దోపిడీలు…!!

గ‌త ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింద‌ని తెలంగాణ డీజీపీ మ‌హెంద‌ర్ రెడ్డి తెలిపారు. 2017 ముగింపు సంద‌ర్భంగా వార్షిక నివేదిక‌ను ఆయ‌న విడుద‌ల చేశారు. గత సంవత్సరం 95వేల 124 కేసులు నమోదు కాగా, .ఈ సంవత్సరం 1ల‌క్ష‌7వేల 428 కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. మొత్తంగా చూసుకుంటే 12.93శాతం క్రైమ్ రేట్ పెరిగింద‌న్నారు.

గ‌తంతో పోలిస్తే దోపిడీలు, కిడ్నాపింగ్’లు, రేపు, చీటింగ్ కేసులు, మహిళలపై వేధింపుల కేసులు పెరిగాయ‌ని ఆయ‌న అన్నారు. 14528 మహిళల వేధింపుల కేసులు, 1414 రేపు కేసులు న‌మోద‌య్యాయ‌ని, 24.25 శాతం రేప్ కేసులు పెరిగాయ‌ని తెలిపారు. ఈ సంవ‌త్స‌రం 691 హ‌త్య కేసులు న‌మోద‌య్యాయ‌ని, 20.76శాతం హ‌త్య‌లు త‌గ్గాయ‌ని చెప్పారు.

చైన్ స్నాచింగ్ లు, గత సంవత్సరం 958 , ఈ సంవత్సరం 705 చైన్ స్నాచింగ్ కేసులు నమోద‌య్యాయి. 1136 సైబర్ క్రైమ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు 20378, మృతులు 5,963, క్షతగాత్రులు 21,697, 708 కల్తీ మాఫియా కేసులు న‌మోద‌య్యాయ‌ని చెప్పారు డీజీపీ.

సైబరాబాద్, రాచకొండ, ఖమ్మంలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. రాబోయే సంవత్సరం అనేక కీలక సంస్కరణలు అమలు చెయ్య బోతున్నామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ పోలీసింగ్ ఆక్టివిటీ సెంటర్ లు ఏర్పాటు చేస్తామ‌ని, దీని వల్ల ప్రజలు పోలీసులు భాగస్వామ్యం తో శాంతి భద్రతల పరిరక్షణ సులువు అవుతుందని ఆయ‌న అన్నారు.