రాములో రాముల.. వార్నర్ మరోసారి !

ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియోస్ తో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఆయన తెలుగు సినిమాలపై పడ్డారు. ముఖ్యంగా స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాలోని పాటలకి తనదైన శైలిలో చిందేస్తున్నాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బుట్టబొమ్మ, రాముల రాముల పాటలకి వార్నర్ స్టెప్పులేశాడు.

తాజాగా మరోసారి రాములో రాముల పాటేసుకొన్నాడు వార్నర్. అయితే వార్నర్ మరోసారి రాములో రాముల పాటేసుకున్నాడు. ఈ సారి మరింత స్టయిల్ గా స్టెప్పులేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్ లో అల.. ఆల్భమ్ 1 బిలియన్ స్ట్రీమ్స్ సొంతం చేసుకున్న సమయంలోనే వార్నర్ మరోసారి రాముల రాముల పాటేసుకోవడం విశేషం.

ఇక ఇటీవల పోకిరి సినిమాలోని ఫేమస్ డైలాగ్ ని తనదైన శైలిలో చెప్పి.. వాహ్ అనిపించాడు వార్నర్. వార్నర్ డైలాగ్ కి దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఫిదా అయిపోయాడు. అంతేకాదు.. వార్నర్ కి గెస్ట్ రోల్ ని ఆఫర్ చేశాడు. ఆయన ఓకే అంటే.. పూరి-విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా ఫైటర్ లోనే వార్నర్ మెరిసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.