‘రెడ్’ మాస్ సాంగ్ టీజర్ వచ్చేసింది

ఎనర్జిటి హీరో రామ్ నుంచి బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. ఆయన తాజా చిత్రం ‘రెడ్’. కిషోర్ తిరుమల దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన రెడ్ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది. ఓటీటీ రిలీజ్ కోసం భారీ ఆఫర్ వచ్చినా.. రామ్ మాత్రం రెడ్ ని ఆలస్యమైనా థియేటర్స్ లోకే తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు.

ఇక ఈరోజు రామ్ బర్త్ డే కానుకగా రెడ్ ఐటమ్ సాంగ్ #DinchakSong టీజర్ ని విడుదల చేశారు. ఈ సాంగ్ లో రామ్ జంటగా హెబ్బా పటేల్ చిందేసింది. రామ్ తో కలిసి ఊపేసింది. ఈ పాటకి థియేటర్స్ లో విజిల్స్ పడటం ఖాయం. ఆ రేంజ్ లో ఊంది సాంగ్. ఇస్మార్ట్ శంకర్ మూడులోనే #DinchakSong ఉండటంతో రామ్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.