‘బాహుబలి’గా మారిన వార్నర్

ఆసీస్ ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియోస్ తో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన టాలీవుడ్ పై పడిపోయారు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లోని పాటలు, డైలాగ్స్ తో టిక్ టాక్ వీడియోలని వదులుతున్నారు. ఇప్పటికే ‘పోకిరి’లోని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పేసిన వార్నర్.. అల.. వైకుంఠపురంలోని పాటలని తనదైన స్టయిల్ లో స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. తాజాగా వార్నర్ బాహుబలి గా మారారు.

బాహుబలి గెటప్ లో ‘అమరేంద్ర బాహుబలి అను నేను.. ‘ అనే డైలాగ్ ని చెప్పేశాడు. ఈ వీడియోలో వార్నర్ కూతురు సైన్యంలా పరుగెత్తుకురావడం చూపించడం ఆకట్టుకొంది. ఇప్పటికే మహేశ్, అల్లు అర్జున్ అభిమానులని ఫిదా చేసిన.. వార్నర్ తాజాగా బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్ ని మురిపించారు. మొత్తంగా వార్నర్ టాలీవుడ్ ప్రేక్షకులని మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా.. భవిష్యత్ లో వార్నర్ తెలుగు సినిమాల్లో మెరుస్తారేమో.. !