రానా పెళ్లిపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్


హీరో రానా దగ్గుబాటి ఓ ఇంటివాడుకాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆమె ఓకే చెప్పింది’ అంటూ ఇటీవలే రానా తన ప్రేయసి మిహిరా బజాజ్ ని పరిచయం చేశారు. ఆ వెంటనే సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి రానాకి శుభాకాంక్షలు వెలువెత్తాయి. రానా ప్రేమ, పెళ్లిపై.. సురేష్ బాబు స్పందించారు. ఈ యేడాదిలోనే రానా పెళ్లి ఉంటుందన్నారు. డిసెంబర్ లో పెళ్లి ఉండే ఛాన్స్ ఉందన్నారు.

ఇక రానా ప్రేమ, పెళ్లి విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ఇండస్ట్రీ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు. అయితే రానా పెళ్లిపై ఆ ఇద్దరు స్పందన ఏంటని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఇద్దరు ఎవరంటే.. ? త్రిష, శ్రీరెడ్డి. త్రిష రానా పెళ్లిపై వార్తపై స్పందించలేదు. కానీ నెటిజన్స్ మాత్రం త్రిష స్పందన ఇదంటూ.. ఆమే ఏడుస్తున్న వీడియోని ఒకటి వైరల్ చేశారు. ఇక శ్రీరెడ్డి మాత్రం తొలిసారి ఆమె తీరుకు భిన్నంగా స్పందించారు. రానాకి శుభాకాంక్షలు తెలిపారు.

‘మీరు ఎంత దూరం వెళ్లారనేది అర్థం అవుతుంది. మీ అమ్మాయితో మీరు మకు మంచి జీవితాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా రానా గారు’ అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో కామెంట్ పెట్టింది రానా. గతంలో రానా తమ్ముడు అభిరామ్ విషయంలో శ్రీరెడ్డి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అభిరామ్ తనకి అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్నారనే ఆరోపించింది. ఈ క్రమంలో సురేష్ బాబుని మామా, రానాని బావ అంటూ.. రచ్చ చేసింది.