ఎన్టీఆర్ కథతో పవన్ సినిమా

ఓ హీరో కోసం రాసుకున్న కథ మరో హీరో దగ్గర వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పూరి జగన్నాథ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాసుకున్న కథలు ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి రవితేజతో తీయాల్సి వచ్చింది. పోకిరి కూడా పవన్ కోసం రాసుకున్న కథ. మహేష్ తో త్రివిక్రమ్ తీసిన ‘అతడు’ కథ కూడా పవన్ కోసం రాసుకున్నదే. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయ్. ట్రెడ్ సెట్ చేశాయ్. స్టార్స్ ని చేశాయి. ఇలా హీరోల విషయంలో జరిగాయి. జరుగుతున్నాయి కూడా.

‘గబ్బర్ సింగ్’ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’తో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే కథ హరీశ్ ఎన్ టీఆర్ కోసం రాసుకున్నారట. ఎందుకో ఈ కథని తారక్ వద్దనుకున్నారు. ఆ కథనే పవన్ కి చెప్పి.. ఒప్పించాడు హరీష్. ఏమాత్రం మార్పులు, చేర్పులు చేయలేదని ఇండస్ట్రీ సమాచారమ్. మరీ.. తారక్ కథతో పవన్ హిట్ కొడతారేమో చూడాలి.