కన్నుగీటు సుందరి షాకింగ్ డిసిషన్

కన్నుగీటేసి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. ‘ఒరు ఆదార్ ల‌వ్’ సినిమాలో ప్రియా కన్నుగీటేసే బిట్ సీన్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఒక్క సీన్ ప్రియాకి స్టార్ హీరో రేంజ్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. ప్రియా ఇన్‌స్టాలో 7.2 మిలియన్‌ ఫాలోవర్స్‌ను సంపాదించారు. అయితే ప్రియా సడెన్ షాక్ ఇచ్చింది. సడెన్ గా ఇన్‌స్టాగ్రామ్ నుండి తప్పుకుంది. ట్రోల్ చేస్తున్నార‌నే కార‌ణంతోనే ప్రియా ఇన్‌స్టాగ్రామ్ నుండి త‌ప్పుకుంద‌ని టాక్. ఇండస్ట్రీలో ఇలాంటివి సాధారణమే.

ట్రోల్ చేస్తున్నారని ఇన్ స్టా నుంచి తప్పుకుంటే.. ప్రియాకే నష్టమేమో.. ! ఎందుకంటే.. ? ప్రియా ఇంకా సోషల్ మీడియా స్టార్ మాత్రమే. ఆమె వెండితెర స్టార్ అయినప్పుడు.. సోషల్ మీడియాతో పనిలేదేమో. అప్పటి వరకు ఆమె సినిమాల ప్రచారం, ఆమె ప్రచారం జరగాలంటే సోషల్ మీడియాని ప్రేమించాల్సిందే. అందులో ఉండాల్సిందే.