లాక్ డౌన్ 4 గైడ్ లైన్స్.. ఇవే !
ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ని పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ 4కి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది. ఈ దఫా లాక్ డౌన్ లో రాష్ట్రాల ఇష్టాలకి పెద్దపీఠ వేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా నిబంధనలు అమలు చేయవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన వాటికి మాత్రం అనుమతి ఇవ్వకూడదు.
లాక్ డౌన్ గైడ్ లైన్స్ ఇవే :
* కంటైన్మెంట్ జోన్లలో కేవలం నిత్యావసరాల కోసమే అనుమతులు ఉంటాయి
* రాత్రి7 నుంచి ఉదయం 7 గంటల వరకు దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ యధాతథంగా అమలులో ఉంటుంది
* దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేయడం వీలుకాదు
* ఎయిర్ అంబులెన్స్ సేవలు, భద్రతా పరమైన కారణాల కోసం, అత్యవసర వైద్య సేవల కోసం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతితో విమాన ప్రయాణాలు చేయవచ్చు
* మెట్రో రైళ్లపై నిషేధం కొనసాగుతుంది
* స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేత మే 31 వరకూ కొనసాగుతుంది
* ఆన్ లైన్ విద్యాబోధన, దూరవిద్య బోధన కొనసాగించవచ్చు
* హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత కొనసాగుతుంది
* హోటళ్లను, లాడ్జీలను వైద్య, ఆరోగ్య, పోలీసు సిబ్బందికి కేటాయించినట్టయితే వాటిని తెరవొచ్చు.
* బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో ఉండే క్యాంటీన్ల మూసివేత
* రెస్టారెంట్ లు డోర్ డెలవరీ చేసుకోవచ్చు