హోం క్వారంటైన్’లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ ఫ్యామిలీ 

మహమ్మారి కరోనా వైరస్ కి సెలబ్రిటీ, సామాన్యుడు అనే తేడానే లేదు. కాటేసిందంటే కాటికిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏమాత్రం అనుమానం ఉన్నా.. వారిని హోం క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. ఈ క్రమంలో బాలివుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీని, అతని కుటుంబాన్ని అధికారులు హోం క్వారంటైన్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో ఉన్న బుధానా గ్రామంలో తన ఇంట్లోనే 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచారు.

ఇటీవల ట్రావెల్‌ పాస్‌ ద్వారా నవాజుద్దీన్‌ మే 15న ఇతర ప్రాంత నుంచి తన ఇంటికి చేరుకున్నాడు. దీంతో అతనితో పాటు అతని కుటుంబాన్ని మే 25 వరకు హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. తన ప్రైవేటు వాహనంలో ఇంటికి చేరుకున్న నవాజుద్దీన్‌తోపాటు అతని తల్లి, సోదరుడు, బావ కూడా కలిసి ప్రయాణించారు. నవాజుద్దీన్‌కు, అతని కుటుంబ సభ్యులకు అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించారు. వారందరికీ కరోనా నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా వారిని 14రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంచారు అధికారులు.