ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న ఆకాష్ పూరి
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. తాజాగా ఆకాష్ పూరి స్నేహితుడు రాహుల్ విజయ్ తో కలిసి ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించారు. పూరీ దర్శకత్వం వహించిన బుజ్జిగాడు, బద్రి, శివమణి, పోకిరి, దేశముదురు, టెంపర్ , ఇస్మార్ట్ శంకర్, పైసా వసూల్.. ఇలా పలు చిత్రాల్లోని మాస్ డైలాగ్ లకు వీరిద్దరూ యాక్ట్ చేసి అలరించారు. వీడియో చివరలో ఖడ్గం సినిమాలోని ఒక్క ఛాన్స్ అండి.. ఒకే ఒక్క ఛాన్స్ డైలాగ్ తో మెప్పించారు.
ఈ వీడియోని ఆకాష్ పూరి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మాకు సినిమా అంటే ప్రేమ. పూరీ జగన్నాథ్ అంటే ఇంకా చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఈ వీడియోపై సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. ‘సూపర్బ్ అబ్బాయిలు.. ఇద్దరూ చించేశారు’ అని అనిల్ రావిపూడి కామెంట్ పెట్టాడు. థ్యాంక్యూ సో మచ్ సర్ !! కానీ ఒక్క ఛాన్స్ సర్ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి అని ఆకాశ్ అన్నారు. పూరీ సైతం తన తనయుడి నటన చూసి మురిసిపోయారు. సూపర్ .. లవ్ యూ అని కామెంట్ చేశారు.
ఆకాష్ పూరి నటించిన ‘రొమాంటిక్’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాకి స్వయంగా పూరి కథని అందించారు. ఆయన శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహించారు. కేతికశర్మ హీరోయిన్ గా నటించింది.
We ❤️ cinema.
Extra love to @purijagan #RahulCallsAkash@ActorRahulVijay pic.twitter.com/4A9cyHtJu5— Akash Puri (@ActorAkashPuri) May 17, 2020