తెలంగాణలోనూ రైట్ రైట్

నాల్గో విడత లాక్  డౌన్ సడలింపుల్లో భాగంగా ఏపీలో ఆర్టీసీ బస్సులకి గ్రీన్ సిగ్నల్ లభించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మీడియా సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ తెలంగాణలో లాక్ డౌన్ మార్గదర్శకాలను వివరించారు. రేపు ఉదయం ఆరు నుంచి ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయని ఆయన తెలిపారు. అయితే హైదరాబాద్ లో సిటీ బస్సు సర్వీసులు నడవవని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఆటోలు, టాక్సీలకు అనుమతి ఇస్తున్నాం. ఆటోలో డ్రైవర్ +2, టాక్సీలో డ్రైవర్+3 నియమం పాటించాలి. జిల్లాల నుంచి బస్సులు హైదరాబాద్ కి వస్తాయి. అయితే సికింద్రాబాద్, జూబ్లీ బస్ట్ స్టాండ్ లకి బస్సులు వస్తాయి. ఇమ్లీ బస్ స్టాండ్ కు మాత్రం బస్సులు రావని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చు. ఈ-కామర్స్ ను అనుమతి ఇస్తున్నామని సీఎం కెసీఆర్ తెలిపారు.