సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకొస్తే.. ఓ ధైర్ఘ్యం. తాజాగా మరోసారి సీఎం కేసీఆర్ మీడియా ముందుకొచ్చారు. మే 31 వరకు తెలంగాణలోనూ లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలో నాల్గో విడత లాక్ డౌన్ గైడ్ లైన్స్ ని వివరించారు. అయితే కంటోన్మెంట్స్ తప్ప మిగితావన్నీ గ్రీన్ జోన్లేనని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే ?
* కంటైన్మెంట్ లు తప్ప మిగిలిన రాష్ట్రమంతా గ్రీన్ జోన్లునే
* గ్రీన్ జోన్లలో అన్ని దుకాణాలు తెరువవచ్చు.
* ప్రయివేటు, ప్రభుత్వ కార్యాలయాలలో వంద శాతం సిబ్బందితో పని చేయవచ్చు
* రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది
* హైదరబాద్ మినహా రాష్ట్రంలో అన్ని బస్సులు నడుస్తాయి
* జిల్లాల నుంచి హైదరాబాద్ కు బస్సులు నడుస్తాయి.
* సెలూన్లు తెరుచుకోవచ్చు
* బార్లు, పబ్బులు, స్విమ్మింగ్ పూల్స్, క్లబ్బులు, మాల్స్, సినిమాహాళ్లకు అనుమతి లేదు
* మాక్స్ ధరించకుంటే రూ. 1000 ఫైన్