సీక్రెట్ మ్యారేజ్ పై శ్రీరెడ్డి వివరణ

వివాదాస్పద నటి శ్రీరెడ్డి సడెన్ షాక్ ఇచ్చింది. తాళిబొట్టు, నుదుటున సింగారంతో కనిపించింది. దీంతీ శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది. ఇంతకీ శ్రీరెడ్ది భర్త ఎవరు ? అనే ప్రచారం జరిగింది. శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. అక్కడే సినిమాలు సీరియళ్లలో నటిస్తోంది. ఓ యువ డైరెక్టర్ తో ఆమె పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

తాజాగా తన పెళ్లి వార్తలపై శ్రీరెడ్డి స్పందించింది. తనకు పెళ్లి కాలేదు. ఇదంతా టిక్ టాక్ వీడియో కోసం వేసుకున్న గెటప్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ టిక్ టాక్ వీడియోని చూస్తే.. తాళీబొట్టు, కట్టుబొట్టు వేసుకోవాల్సినంత మేటర్ ఏమీ కనిపించలేదు. కావాలనే శ్రీరెడ్ది తన పెళ్లి విషయాన్ని దాస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే శ్రీరెడ్డి దాచే రకం కాదు. ఏం చేసినా బోల్డ్ గా చేసేస్తుంది. చెపేస్తుందని ఆమెని సపోర్ట్ చేసే జనాలు అంటున్నారు.