సుస్మితాసేన్ ని సేవ్ చేసిన నుంచాక్
బాలీవుడ్ బ్యూటీ సుస్మితాసేన్ 2014 సెప్టెంబర్‌లో అడిసన్ వ్యాధితో బాధపడింది. పూర్తిగా రోగనిరోధక శక్తిని కోల్పోయింది. వ్యాధి నుండి బయటపడటం కోసం ఎన్నో మెడిసన్స్ వాడిందట. దాని వలన సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో పాటు జీవితం సమస్యగా మారుతుందేమోనని భయపడిందట.
అలాంటి సమయంలో తన జీవితాన్ని రీబుల్డ్ చేసుకోవడానికి నుంచాకు సాధన చేసింది. దీని వలన 2019 నాటికి మాములు స్థితికి వచ్చింది సుస్మితా. తాజాగా సుస్మితా నుంచాక్ ప్రాక్టీస్ కి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేసింది. ఇందులో సుస్మితా ఓ వీరనారిలా కనిపిస్తున్నారు. ఆ వీడియోని మీరు చూడండీ.. !