హైదరాబాద్ లో జిల్లా బస్సులు అక్కడి వరకే అనుమతి
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడెక్కాయ్. నాల్గో విడత లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఆర్టీసీ బస్సులకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మినహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడుపుకోవచ్చని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాల నుంచి బస్సులు హైదరాబాద్ కి రావొచ్చు. కంటైన్మెంట్ జోన్లకి వెళ్లవు. సికింద్రాబాద్, జూబ్లీ బస్టాండ్ లని జిల్లాల నుంచి బస్సులు వస్తాయని తెలిపారు. ఈ ఉదయం 6 గంటల నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ కార్యకాలాపాలు ప్రారంభమయ్యాయి.
* కరీంనగర్ వైపు నుంచి రాజధాని నగరానికి వచ్చే బస్సులు జేబీఎస్ వరకే అనుమతి
* నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే బస్సులను హయత్ నగర్ వరకు
* మహబూబ్ నగర్ వైపు నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్ వరకు
* వరంగల్ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ చౌరస్తా వరకు
* కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ డిపోల బస్సులు పహాడీ షరీఫ్ వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.