విద్యుత్ ఛార్జీలపై పెంపుపై బాబు ఆగ్రహం

ప్రపంచం మొత్తం కరోనా ఫీవర్ లో ఉన్నా.. ఏపీలో మాత్రం రాజకీయాలు ఆగడం లేదు. కరోనా విజృంభణలోనూ ఏపీ రాజకీయాలు హీటెక్కడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దానికి కారణం బలమైన ప్రతిపక్షమా ? అంటే అసలే కాదేమో.. ! వైకాపా ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా గద్దె దించాలన్న తెదేపా అధినేత చంద్రబాబు కసి, కుట్ర అనే చెప్పలేమో. ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలని పెంచింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయడం, పోరాటలు చేయడం ప్రతిపక్షంగా తెదేపా హక్కు, బాధ్యత కూడా. 

అయితే లాక్‌డౌన్ సమయంలోనూ తెదేపా నిరసన దీక్షలకి పిలుపునివ్వడం విశేషం. ఛార్జీలు పెంచడం దుర్మార్గమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో తెదేపా నాయకులు ఇళ్లలోనే ఉంటూ నిరసన దీక్షలు చేయాలని ఆదేశించారు. 

అంతేకాదు.. మళ్లీ తెదేపా అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని కూడా ప్రకటించారు. దీంతో తెదేపా నిరసనలు ప్రజల కష్టాలని తగ్గించడానికి కాదు. మళ్లీ అధికారంలోకి రావడానికి ఓప్రయత్నం అని ఏపీ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మరీ.. ఏపీలో గట్టిగా పాతుకుపోయిన వైకాపాను తెదేపా ఓడించగలదా ? అంటే.. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదేమో. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.