కేసీఆర్’కు కిషన్ రెడ్డి కౌంటర్

కరోనా విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ భారీ ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరణలని కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ఐదు ప్యాకేజీలుగా విభజించి.. ఆ వివరాలని వరుసగా ఐదు రోజుల పాటు మీడియాకు వివరించారు. అయితే, కేంద్రం తీసుకొచ్చిన ఆర్థిక, ప్యాకేజీ అందుకు కేంద్రం పెట్టిన షరతులపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం ప్యాకేజీ ఉత్తదే. అది డొల్ల ప్యాకేజీ. అంకెల గారడీ అని సోమవారం ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ విమర్శించారు. తాజాగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. మీడియా సమావేశంలో కేసీఆర్ వాడిన భాష సరిగా లేదని ఆక్షేపించారు. కేంద్రం ప్రకటించిన రూ.21లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతోందో కేసీఆర్ వివరించాలన్నారు. 

తాము తప్ప ఏపార్టీ ఉండకూడదనే సంకుచిత ధోరణిలో సీఎం ఉన్నారు…కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకపోతే రైతు బంధు పథకం వర్తించదని చెబుతున్నారు… సంస్కరణలు, గిట్టుబాటు ధరల కోసం అలా చేశారేమో?. రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నామా? మీరు చేసింది సరైనప్పుడు.. కేంద్రం చేసింది ఎందుకు సరికాదు. సీఎం కేసీఆర్ రెండు నాల్కల ధోరణి ఎందుకు అవలంభిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.