ఎన్టీఆర్ బర్త్ డే.. రెండు గిఫ్టులు !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకి గుడ్ న్యూస్. ఎన్టీఆర్ బర్త్ గిఫ్ట్ ఒకటి కాదు రెండు రాబోతున్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రేపు (మే 20) ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ వస్తుందని ఆశించారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ తారక్ లుక్ తెలిసిపోనుందని ఆశపడ్డారు. కానీ అభిమానుల ఆశలపై ఆర్ఆర్ఆర్ చిత్రబృందం నీళ్లు చల్లింది. కరోనా ఎఫెక్ట్ తో ‘రామరాజు ఫర్ భీమ్’ తీసుకురాలేకపోతున్నామని ప్రకటించింది.

అయితే అభిమానుల కోరికని తీర్చబోతున్నట్టు తారక్ ఫిజికల్ ట్రైయినర్ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్ ప్రకటించారు. ఎన్టీఆర్ ను ట్రయిన్ చేసినపుడు, ఫిజికల్ ఎక్స్ ర్ సైజ్ లుచేయించినపుడు తీసిన ఫొటోలు, విడియోలు కలిసి ఓ వీడియోని వదలబోతున్నాడు. మరో సప్రైజ్ ఏంటంటే.. ? బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్స్ తారక్ బర్త్ డే కానుకగా ఓ సప్రైజ్ ప్లాన్ చేశారు. రేపు ఉదయం 10 గంటలకి ఆ సప్రైజ్ ని వదలనున్నారు.