కేజీఎఫ్ 2 శాటిలైట్ రైట్స్.. షాకింగ్ రేటు !

జాతీయ స్థాయిలో సత్తా చాటిన దక్షిణాది చిత్రలు బాహుబలి, కేజీఎఫ్. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్లో వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ సినిమాలకి ధీటుగా వసూళ్లు రాబట్టాయి. అయితే వసూళ్లలో మాత్రం బాహుబలి 2 నే టాప్ గా నిలిచింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాల లిస్టులో బాహుబలి 2 రెండో స్థానంలో నిలిచింది. దక్షిణాది సినిమాల్లో బాహుబలి2 నే నెంబర్ వన్. 

ఇప్పుడు బాహుబలి 2 రికార్డుని కేజీఎఫ్ 2 బ్రేక్ చేస్తోంది. ఇటీవల ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ రూ. 55కోట్లకి కొనుగోలు చేసింది. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే..? 120 కోట్లకు కెజిఎఫ్ 2 శాటిలైట్ హక్కులను ఓ ఛానెల్ కొనుగోలు చేసిందని తెలిసింది. దీంతో కేజీఎఫ్ 2 విషయంలో నాన్ థియేటర్ హక్కుల రూపంలోనే దాదాపు 200 కోట్లకు పైగా వ్యాపారం జరిగేలా కనిపిస్తోంది.