50లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచంలో, భారత్ లోనూ మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాపంగా 50లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3.25లక్షల మంది మృతి చెందారు. అత్యధికంగా అమెరికా 1,571,018 , రష్యా 308,70, స్పెయిన్‌ 278,803, బ్రెజిల్‌ 271,885 దేశాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

భారత్ లోనూ కరోనా కేసుల సంఖ్య లక్ష దాటిన సంగతి తెలిసిందే. దేశంలో గత 24 గంటల్లో 5600 మందికి కరోనా సోకింది.   మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 5,611 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇదే సమయంలో 140 మంది ప్రాణాలు వదిలారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,750కి పెరిగాయి.