రానా పెళ్లిపై పెద్దల సమాలోచనలు

హీరో రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆమె ఓకే చెప్పింది’ ఇటీవలే ప్రేయసి మిహికా బజాజ్ ని పరిచయం చేశాడు రానా. మిహికా పక్కా హైదరాబాద్ అమ్మాయి. బంటీ బజాజ్-సురేష్ బజాజ్ దంపతుల కూతురు. రానా-మిహికాల వివాహం డిసెంబర్ లో ఉంటుందని సురేష్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజే (బుధవారం) రానా నిశ్చితార్థ వేడుక. ఇందుకోసం రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

తాజాగా ఈ ప్రచారంపై రానా తండ్రి సురేష్ బాబు వివరణ ఇచ్చారు. రానా నిశ్చితార్థం ఈరోజు జరగడం లేదు. ఈ రోజు కేవలం ఇరు కుటుంబాల పెద్దల సమావేశం మాత్రమే ఉంటుంది.  హిందూ సాంప్రదాయం ప్రకారం నిశ్చితార్థానికి ముందు ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని మంచి, చెడులు చర్చిస్తారని తెలిపారు. నిశ్చితార్థం, వివాహం ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ సమావేశం ముగిసింది. ఆ మీటింగ్ అప్ డేట్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.