200 రైళ్ల రాకపోకలకి గ్రీన్ సిగ్నల్.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నంటే ?
పాసింజర్ రైళ్లకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి రోజువారీ రాకపోకలు సాగించే 200 రైళ్లను రైల్వేబోర్డు బుధవారం రాత్రి ఖరారు చేసింది. జోన్లు, రూట్ల వారీగా నడిపే రైళ్లు, ప్రయాణ వేళల వివరాల్ని అన్ని జోన్ల జీఎంలకు పంపించింది. ఈరోజు (మే 21) నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. వీటిని ప్రత్యేక రైళ్లుగా నడుపుతారు. గతంలో మాదిరే స్లీపర్, ఏసీ, జనరల్ బోగీలు ఉంటాయి. ఈ రైళ్ల సమయాలు, ఆగే స్టాపులూ గతంలోలాగే ఉంటాయి.
ఈ 200 రైళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి పోయే రైళ్ల వివరాలు :
* ముంబయి-హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ (02701/02)
* హావ్ డా- సికింద్రాబాద్ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ (02703/04)
* హైదరాబాద్-న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్ ప్రెస్ (02723/24)
* దానాపూర్ – సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ ప్రెస్ (02791/92)
* విశాఖపట్నం- దిల్లీ ఏపీ ఎక్స్ ప్రెస్ (02805/06)
* గుంటూరు- సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ ప్రెస్ (07201/02)
* తిరుపతి- నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ ప్రెస్ (02793/94)
* హైదరాబాద్ – విశాఖపట్నం గోదావరి ఎక్స్ ప్రెస్ (02727/28)