సూపర్ స్టార్ రజినీ సంచలన ప్రకటన..!
సూపర్ స్టార్ రజినీ కాంత్ సంచలన ప్రకటన చేశారు. అభిమానులందరికీ న్యూఇయర్ గిప్ట్ ఇచ్చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు అభిమానుల సాక్షిగా ప్రకటించారు. కొంతకాలంగా తమిళ రాజకీయ పరిస్థితులు చూస్తోంటే తనకు ఏదోలా ఉందని, ప్రజల కోసం తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని రజినీ అన్నారు.
తనకు తమిళ ప్రజల దీవెనలు కావాలని కోరారు. త్వరలోనే కొత్త రాజకీయా పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటిస్తానని ఆయన తెలిపారు. మొత్తం 234 స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు.