పార్టీ ఏర్పాటులో వాళ్లే కీల‌కం..!! : ర‌జినీ

గ‌త కొంత కాలంగా ఊరిస్తూ వ‌స్తూన్న సూప‌ర్ స్టార్ ర‌జినీ రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై అనుమానాలు తొల‌గిపోయాయి. న్యూఇయ‌ర్ లో తాను కొత్త రాజ‌కీయ పార్టీని స్థాపించ‌బోతున్న‌ట్లు ర‌జినీ ప్ర‌క‌టించ‌డంతో అటు అభిమానుల‌తో పాటు , ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి ఎక్కువైంది. పార్టీ ఏర్పాటులో ఎవ‌రు కీల‌కంగా ఉంటారు అనే విష‌యంపై కూడా ర‌జినీకాంత్ స్ప‌ష్ట‌త‌నిచ్చారు.

ఇన్నాళ్లు త‌న అభివృద్ధిలో పాలుపంచుకున్న అభిమానులే కొత్త రాజ‌కీయ పార్టీ ఏర్పాటులో కీల‌కంగా ఉంటార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ విష‌యంపై అభిమానుల‌తో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. రొటీన్ పొలిటిక‌ల్ పార్టీల‌లా కాకుండా త‌న‌దైన శైలిలో పార్టీ నిర్మాణం ఉండేలా ర‌జినీ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. న్యూఇయ‌ర్ లో కొత్త పార్టీ ప్ర‌క‌టించ‌నున్నారు ర‌జినీ..