చైతూ శాడిజం బయటపెట్టిన సామ్


స్టార్ హీరోయిన్ సమంత భర్త నాగ చైతన్య శాడిజాన్ని బయటపెట్టింది. చైతూ ఎక్కడో పెద్ద గొయ్యి తొవ్వుతున్నాడని కామెంట్ పెట్టింది. అలాగని ఇది సీరియస్ కామెంట్ కాదు.. సరదా కామెంట్. బుధవారం రామానాయుడు స్టూడియోలో రానా-మిహీకా బజాజ్ ల రోకా వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చైతూ, సామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. ఈ కార్యక్రమంలో దిగిన ఫోటోలని సమంత తన ఇన్ స్టో గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఓ ఫ్యామిలీ పిక్ తో పాటు భర్త చైతూ సింగిల్ ఫోటో ఒకటి షేర్ చేసింది.

‘మమ్మీ, ఆంటీస్‌, ఫ్రెండ్స్, సిస్టర్స్ అందరిని పంపిన తర్వాత ఇప్పుడు ఇన్‌ స్టా గ్రామ్ టైమొచ్చింది. నా భర్త చాలా అందంగా కనిపిస్తున్నారు కదా.. ? ( భర్త ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు) అంటూ ఫన్నీ కామెంట్ పెట్టింది. సామ్ కామెంట్ కి చైతూ రిప్లై ఇచ్చారు. ఇదేదో ఇతరుల భాగస్వామ్యంతో చేసిన పెయిడ్‌ పోస్ట్‌లలో ఒకటిగా కనిపిస్తుందని అని కామెంట్ పెట్టాడు.

ప్రస్తుతం చైతూ ‘లవ్ స్టోరీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. సాయిపల్లవి హీరోయిన్. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక సామ్ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది.