గుడ్ న్యూస్ చెప్పిన ఆర్భీఐ

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియా ముందుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆర్‌బీఐ గవర్నర్ మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ‌రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి(40 బేసిస్‌ పాయింట్లు)తగ్గించినట్లు చెప్పారు. రివర్స్ రెపో రేట్ కూడా 3.35 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. మొదటిసారి లాక్‌డౌన్ విధించినప్పుడు మార్చి 27న మూడు నెలల మారటోరియం ప్రకటించాం. లాక్ డౌన్ పొడిగించడంతో ఇప్పుడు దాన్ని దాన్ని మరో మూడు నెలలు అంటే ఆగస్టు 31 వరకూ పొడిగిస్తున్నారు.

ఆర్బీఐ గవర్నర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు :

* కరోనా లాక్‌డౌన్ వల్ల దేశంలో పెట్టుబడుల ప్రవాహంపై గణనీయంగా ప్రభావం పడింది

* కోవిడ్-19 వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది.

* మార్చిలో భారత పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం మేర పడిపోయింది.

* దేశంలో ఆరు పెద్ద పారిశ్రామిక రాష్ట్రాలు రెడ్ జోన్లో ఉన్నాయి.

* ఏప్రిల్‌లో తయారీరంగం ఎప్పుడూ లేనంత క్షీణత నమోదైంది.

* మార్చిలో కాపిటల్ గూడ్స్ ఉత్పత్తిలో 36 శాతం పతనం.

* వినియోగ వస్తువుల ఉత్పత్తి 33 శాతం పడిపోయింది.

* తయారీరంగంలో 21 శాతం తక్కువ వృద్ధి నమోదైంది.
* దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.

* ఆహారధాన్యాల ఉత్పత్తితో పెరుగుదలతో ఆహార భద్రతకు భరోసా వచ్చింది. ఖరీఫ్‌లో పంట దిగుబడి 44 శాతం పెరిగింది.

* మొదటిసారి లాక్‌డౌన్ విధించినప్పుడు మార్చి 27న మూడు నెలల మారటోరియం ప్రకటించాం. లాక్ డౌన్ పొడిగించడంతో ఇప్పుడు దాన్ని దాన్ని మరో మూడు నెలలు అంటే ఆగస్టు 31 వరకూ పొడిగిస్తున్నాం.

* 2020-21లో భారత్ విదేశీ మారక నిల్వల్లో 9.2 బిలియన్ డాలర్ల వృద్ధి నమోదైంది. భారత విదేశీ మారక నిల్వలు ఇప్పుడు 487 బిలియన్ డాలర్లకు చేరాయి