నెం.4పై నిలదీసిన గంభీర్
టీమిండియాలో నెం.4 ఇప్పటికీ తీరని సమస్యే. నాల్గో స్థానంలో మంచి ఆటగాడిన తయారు చేసుకోకపోవడం కారణంగా వన్డే వరల్డ్ కప్ కోల్పోయామని మాజీలు విమర్శణలు చేస్తున్నారు. అదీ నిజమే. తాజాగా నెం.4పై టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్.. సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ని నిలదీశారు. ఆన్ లైన్ లో చర్చలో పాల్గొన్న గంభీర్ భారత జట్టు నాలుగో స్థానం సమస్యకు పరిష్కారం కనుక్కోలేకపోయినందుకు ఎమ్మెస్కే బృందంపై గంభీర్ మండిపడ్డాడు.
సెలక్టర్లు సరైన నాలుగో స్థానం బ్యాట్స్ మన్ ను ఎంపిక చేయలేకపోయారు. రెండేళ్ల పాటు రాయుడును ఎంపిక చేశారు. కానీ ప్రపంచకప్ కు ముందు మాత్రం మీకు 3-డి (విజయ్ శంకర్) అవసరమయ్యాడుఅని గంభీర్ అన్నాడు. దీనికి ఎమ్మెస్కే బదులిస్తూ.. టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే విజయ్ శంకర్.. ఇంగ్లిష్ పరిస్థితుల్లో బంతితోనూ ఉపయోగపడతాడని భావించామని చెప్పాడు.