కొడుక్కి నటనలో శిక్షణ ఇస్తున్న మహేష్
కరోనా లాక్డౌన్ తో ఇంటికే పరిమితమైన సూపర్ స్టార్ మహేష్ బాబు హాయిగా ఫ్యామిలీతో గడుపుతున్నారు. తన ఇద్దరు పిల్లలతో ఆడుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి మహేష్ అభిమానులని సంతోష పెడుతున్నాయి. తాజాగా మహేష్ తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో తనయుడు గౌతమ్ కి మహేష్ నటనలో శిక్షణ ఇస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఓ వార్నింగ్ సీన్ లో తనయుడిని ట్రైయిన్ చేస్తున్నట్టు సీన్ లో కనిపిస్తోంది.
ఈ వీడియోలో తనయుడు గౌతమ్ మీద మీదకు వచ్చిన మహేష్.. ఓ వార్నింగ్ ఇచ్చారు. అయితే కౌంటర్ ఇవ్వాల్సిన గౌతమ్ మహేష్ ఎక్స్ ప్రెషన్స్ ని చూసి నవ్వుల్లో మునిగిపోవడం చూడొచ్చు. ఇక సినిమాల విషయానికొస్తే.. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ తదుపరి సినిమా ఉండనుంది. ఇదో ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అయితే ఎమోషన్స్ బలంగా ఉంటాయని చెబుతున్నారు. షూటింగ్స్ అనుమతి లభించిన నేపథ్యంలో జూన్ లో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.