ఆన్ లైన్’ లో యాదాద్రి లడ్డూలు

మహమ్మారి కరోనా నుంచి దేవుళ్లు కూడా తప్పించుకోలేకపోయారు. కరోనా ఎఫెక్ట్ తో దేశ వ్యాప్తంగా అన్నీ దేవాలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో దేవాలయాలు తెరచుకొనేలాలేవ్. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ లో తిరుమల తిరుపతి లడ్డూలు అమ్మాలని నిర్ణయించారు. తాజాగా టీటీడీ తరహాలోనే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి లడ్డూలను ఆన్‌లైన్ ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.

పులిహోర, లడ్డూలు ఆన్ లైన్ ద్వారా అమ్మనున్నారు. 80 గ్రాముల బెల్లం లడ్డూ రూ.25కు విక్రయిస్తున్నారు. చక్కరతో చేసిన లడ్డు 100 గ్రాము లు రూ.20కు, కళ్యాణం లడ్డూ రూ.100 కు విక్రయిస్తున్నారు. ఇకపై వీటిని ఆన్‌లైన్ ద్వారా భక్తులకు అందించనున్నారు. మరోవైపు యాదాద్రి దేవాలయం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.