‘వి’ విడుదల వాయిదా.. దర్శకుడు హ్యాపీ !
కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడిన సినిమాల్లో ‘వి’ ఒకటి. ఈ సినిమా వాయిదా పడినందుకు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ హ్యాపీగా ఉన్నారు. దీనికి ఆయన చెప్పే లాజిక్ కూడా బాగుంది. ‘వి’ విడుదలకి ముందు లాక్ డౌన్ పడింది. అదే సినిమా థియేటర్లలోకి వచ్చిన 2-3 రోజులకు లాక్ డౌన్ పడినట్టయితే పరిస్థితి దారుణంగా ఉండేది. సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. థియేటర్లు పడితే భారీ నష్టం తప్పేది. దానికి తోడు పైరసీ బయటికొచ్చేసేంది. నష్టం ఓ రేంజ్ లో ఉండేది.
రిలీజ్ కి ముందే లాక్ డౌన్ పడటంతో భారీ నష్టం తప్పిందని.. అందుకు హ్యాపీ అన్నారు ఇంద్రగంటి. ‘వి’ సినిమా ఓటీటీ రిలీజ్ ని ప్రతిపాదనని ఇంద్రగంటి వ్యతిరేకించారు. తమ సినిమాను థియేటర్లలో చూస్తే ఆ మజానే వేరు అంటుందని తెలిపాడు. ఇక ఈ లాక్ డౌన్ టైంలో మూడు కొత్త కథలని రెడీ చేశారు. వి సినిమా విడుదలైన వెంటనే తదుపరి సినిమా ప్రకటన ఉంటుందని తెలిపారు. ఇక వి సినిమాలో నాని, సుధీర్ బాబు, నివేధా థామస్, అతిథి రావు హైదరి హీరో-హీరోయిన్లుగా నటిస్తున్నారు.