‘నో పెళ్లి.. దాని తల్లి’ రైమింగ్ అదిరింది

మెగా యంగ్ హీరో సాయితేజ్ తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. నభా నటాషా కథానాయిక. కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాత. మే1న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది. రంజాన్ కానుకగా సోమవారం ఈ సినిమా నుంచి నో పెళ్లి వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఈ సాంగ్ లో వరుణ్ తేజ్, రానా కూడా మెరిశారు.

ఈ పాటలో లిరిక్స్ భలేగా వున్నాయి. ముఖ్యంగా ..’నో పెళ్లి..దాని తల్లి’ అంటూ రాయడం కొతగ్గా ఉంది. పెళ్లి..దానమ్మ అంటే మరీ అసహ్యంగా వుంటుంది. అందుకే పాలిష్ చేసి, నో పెళ్లి..దాని తల్లి అంటే చక్కగా రైమింగ్ కుదిరినట్లు అయింది. ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. అయితే మరికొంతకాలం వేచి చూసి.. అప్పటికీ థియేటర్స్ ఓపెన్ కాకుంటే ఓటీటీ రిలీజ్ పై ఆలోచిద్దామనే ధోరణిలో చిత్రబృందం ఉంది.