ప్రగ్యా.. అదే పనిగా పెట్టుకుంది !


ఆఫర్లు రావాలంటే అందాల గాలం వేయాల్సిందే. హీరోయిన్లకి బాగా తెలిసిన సూత్రం ఇది. ఏమాత్రం అవకాశాలు తగ్గినా.. గ్లామర్ షోతో అదరగొట్టడం.. తద్వార ఆఫర్లు చేజిక్కించుకోవడం అందాల భామలకి అలవాటు. ఇప్పుడు అందాల ఆరబోతనే పనిగా పెట్టుకుంది ప్రగ్యా జైశ్వాల్. కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ.

అందం+అభినయంతో ఆకట్టుకుంది. దర్శకుడు క్రిష్ ఆస్థాన హీరోయిన్ అనిపించుకుంది. కానీ బిజీ హీరోయిన్ కాలేకపోయింది. నక్షత్రం, ఆచార్య అమెరికా యాత్ర తర్వాత మళ్లీ తెలుగు తెరపై ప్రగ్యా కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్ల కోసం ట్రై చేస్తోంది.

ఈ క్రమంలో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తోంది. ఛాన్స్ ఇస్తే.. దేనికైనా రెడీ అన్నట్టుగా ఉన్నాయి ఆమె ఫోటో షూట్స్. యెద అందాలతో గాలం వేస్తోంది. అన్నీ యాంగిల్స్ లో అందాల ఆరబోత చేస్తోంది. మరీ.. ప్రగ్యా అందాల ఆరబోత ఆమెకి ఆఫర్లు తీసుకొస్తాయా ? అన్నది చూడాలి.