పడకగదిలోకి ఎవరు బలవంతం చేయరట


సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని అందరూ అంగీకరించే మాట. అయితే చాలా మంది మాత్రం తమకు ఆ అనుభవం ఎదురవ్వలేదని చెబుతుంటారు. శ్రీరెడ్ది లాంటోళ్లు కొందరు మాత్రం సినీ పరిశ్రమలో పడకగది పిలుపులపై పోరాటం చేశారు. చేస్తున్నారు. సినీ ఆఫర్లని గాలంగా వేసి.. తమని శారీకంగా వాడుకుంటున్నారన్నది వీరి ఆరోపణ. ఇప్పటికే చాలామంది హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ పై తమ అభిప్రాయాన్ని చెప్పారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ పడకగది పిలుపులపై అసక్తికర కామెంట్ చేశారు.  

“అసలు కాస్టింగ్ కౌచ్ కు పూర్తి కారణం అమ్మాయిలేనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేలా అంటే.. ?  ఎవరైనా కాస్టింగ్ కౌచ్ కు ప్రయత్నించిన సమయంలో అమ్మాయిలు ‘నో’ అంటే సరిపోద్ది. ఆ విషయం అక్కడితో ముగుస్తుంది. ఇండస్ట్రీలో ఒకరిని ఒకరు బలవంత పెట్టే పరిస్థితి అస్సలు ఉండదు. అన్ని రంగాల్లో కూడా అమ్మాయిలను వాడేసుకోవాలని కొందరు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో అమ్మాయిలు నో చెబితే ఎవరు అంతకు మించి మరో అడుగు వేయరు” అని నందిని రాయ్ చెప్పుకొచ్చింది.