దేశానికి కావాల్సింది ఆ నాలుగు ‘C’ లే…! : వెంకయ్య
మీడియాతో ఇష్టాగోష్టి చర్చలో ఉపరాష్ట్రపతి వెంకయ్య మనసు విప్పి మాట్లాడారు. దేశానికి కావాల్సింది మూడు Cలు కాదని, నాలుగు Cలు కావాలని ఆయన వ్యాఖ్యానించారు. క్యాష్, కమ్యూనిటీ, క్యాస్ట్.. ఈ మూడు Cలు దేశంపై కొంత ప్రభావం చూపుతున్నాయని, ఇది మంచిది కాదని ఆయన అన్నారు.
కెపాసిటీ, క్యారెక్టర్, క్యాలిబర్, కాండాక్ట్ ఈ నాలుగు Cలు దేశానికి కావాలన్నారు. ప్రజలు సానుకూల ధృక్పథం అలవర్చుకోవాలని ఆయన చెప్పారు. సినిమాల్లో వివాదస్పద అంశాలు, కులాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదని చెప్పారు వెంకయ్య.
ప్రభుత్వాలు వ్యవసాయానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, మండల స్థాయిలో గోడౌన్ల నిర్మాణం జరగాలని ఆయన అన్నారు. గోడౌన్లల్లోని వ్యవసాయ ఉత్పత్తులకు బ్యాంకులు రుణాలివ్వాలని వెంకయ్య తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.