TSలో 71 కొత్త కేసులు

తెలంగాణలో మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 71 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. 120 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. కరోనాతో ఈరోజు ఒకరు మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

తాజా కేసులతో కలుపుకొని తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1991కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 1284 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 650 మంది చికిత్స పొందుతున్నారు. 51మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇక తెలంగాణలో నాల్గో విడత లాక్‌డౌన్‌ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ ని పొడగిస్తారా ? లేదా.. ? అన్నది తెలియాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లోనే కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది.