అమెరికాలో లక్ష దాటిన కరోనా మరణాలు
కరోనా దెబ్బకు అమెరికా తల్లడిల్లిపోతోంది. తాజాగా అమెరికాలో కరోనా మరణాల సంఖ్య లక్ష దాటింది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 28 శాతానికిపైగా ఆ ఒక్క దేశంలోనే నమోదయ్యాయి. కేసుల విషయంలోనూ మరే దేశానికీ అందనంత ఎత్తులో అమెరికా ఉంది. ఇప్పటివరకు అక్కడ 17 లక్షల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్త కేసుల్లో 30 శాతానికిపైగా అగ్రరాజ్యంలో నమోదయ్యాయి.
ఒక్క న్యూయార్క్ లోణే 29 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. అక్కడ 3.7 లక్షల మందికి వైరస్ సోకింది. మహమ్మారి దెబ్బకు న్యూజెర్సీలో 10 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆరంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్యమే.. కొంపముంచిందని చెప్పుకొంటున్నారు. లాక్ డౌన్ విధించడంలో ట్రంప్ ఆలస్యం చేశారు. దానికి తగిన మూల్యం ఇప్పుడు అమెరికా చెల్లించుకుంటోంది. ఇక సింగపూర్, బ్రెజిల్, రష్యాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. సింగపూర్ ఆర్థిక మాద్యంలో కూరుకుపోయింది.