హీరోయిన్ అనుమతి లేకుండానే సల్మాన్..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అసలు బుద్దిని బయటపెట్టింది సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ. సల్మాన్ ఖాన్-భాగ్య శ్రీ జంటగా నటించిన ‘మైనే ప్యార్ కియా’ (1989) బ్లాక్ బస్టర్ హిట్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ ‘మైనే ప్యార్ కియా’ రోజులని గుర్తు చేసుకొంది. సల్మాన్ అసలు బుద్ది ఎలాంటిదనే విషయాన్ని చెప్పింది.’మైనే ప్యార్ కియా’ విడుదలైన సమయంలో సల్మాన్, భాగ్య శ్రీ కలిసి చాలా ఫోటో షూట్స్ లో పాల్గొన్నారట. అయితే ఓ ఫేమస్ ఫోటో గ్రాఫర్ సల్మాన్-భాగ్య శ్రీలపై హాట్ హాట్ ఫోటో షూట్ చేయడానికి ప్రయత్నించారట.
ఇందుకోసం సల్మాన్ ని పక్కకు పిలిచి.. మీరు సడెన్ గా భాగ్య శ్రీకి ముద్దుపెట్టండి. నేను కెమెరాని రెడీ చేసి ఉంచగానే చెబుతానని చెప్పారట. అందుకు సల్మాన్ నో చెప్పారట. మీకు అలాంటి పోజు కావాలంటే.. ముందుగా భాగ్య శ్రీ అనుమతిని తీసుకొండని సల్మాన్ చెప్పారట. ఆ మాటలు వెనక నుంచి విన్న భాగ్య శ్రీకి సల్మాన్ పై గౌరవం పెరిగిందట.
ప్రస్తుతం భాగ్యశ్రీ రెండు దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నారు. రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో ఆమె పాల్గొన్నారు. దీనితోపాటు కంగనారనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తలైవి చిత్రంలో నటిస్తున్నారు.