తాత లేని లోటు తీరనిది
తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి (ఎన్టీఆర్). ఆయన 97వ జయంతి నేడు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ కు తెలుగు ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక తాత జయంతి రోజున తారక్ ఎమోషనల్ ట్విట్ చేశారు. ‘మీరు లేని లోటు తీరనది’ అని కామెంట్ పెట్టారు.
“మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా” అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు తారక్. కళ్యాణ్ రామ్ కూడా తన ట్విట్టర్‌లో “మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోతి ” అంటూ శ్రద్ధాంజలి ఘటించారు.
మీరు లేని లోటు తీరనిది… pic.twitter.com/FA1uyWaWoS
— Jr NTR (@tarak9999) May 28, 2020