ఐక్యతని చూపిన ఎన్టీఆర్ ఫ్యామిలీ
తెలుగు జాతి ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్ పేరు మారుమ్రోగుతూనే ఉంటుంది. మహానటుడు, మహానాయకుడుగా తెలుగు నేలపై చెదరని ముంద్రవేశాడు ఎన్టీఆర్. ఆయన 97వ జయంతి నేడు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలు అన్న ఎన్ టీఆర్ కి నివాళులు అర్పిస్తున్నారు. ఎప్పటిలాగా ఎన్ టీఆర్ ఫ్యామిలీ హైదరాబాద్ నెక్లెస్ రోడ్దులోని ఎన్ టీఆర్ ఘూట్ వచ్చి నివాళులు అర్పించారు. అయితే ఎన్ టీఆర్ జయంతి, వర్థింతి రోజున ఎన్ టీఆర్ కుటుంబ సభ్యులు ఎవ్వరికి వారు వచ్చి నివాళులు అర్పించి వెళ్లేవారు.
ఈ సారి మాత్రం ఎన్ టీఆ ఫ్యామిలీ యూనిటీ కనిపించింది. ఈ ఉదయం నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ, నందమూరి సుహాసిని, నందమూరి వసుంధర, దగ్గుపాటి పురందేశ్వరి, దగ్గుపాటి వెంటేశ్వర్ రావు తదితరులు ఒకేవారి వచ్చారు. నివాళులు అర్పించారు. జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు మాత్రం వీరితో రాలేదు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ‘తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేటికీ దేశానికి ఆదర్శంగా నిలిచాయి.ఎన్టీఆర్ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలి. విప్లవాత్మక పథకాలతో ప్రజల గుండెల్లో ఆయన నిలిచారు’ అన్నారు.