బాలయ్యకు నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్
షూటింగ్స్ అనుమతి కోసం ఇటీవల సినీ ప్రముఖులు మంత్రి తలసాని శ్రీనివాస్ తో ఓ మారు సీఎం కేసీఆర్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో హీరో బాలకృష్ణ కనిపించలేదు. దీనిపై గురువారం స్పందించిన బాలయ్య.. తనని ఎవరు పిలవలేదన్నారు. అక్కడి ఆగకుండా.. మంత్రి తలసానితో కలిసి సినీ ప్రముఖులు భూములు పంచుకుంటున్నారా ? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి పెత్తనంపై కాస్త పెదవి విరిచినట్టు మాట్లాడారు.
ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. “ఇండస్ట్రీకి మీరు కింగ్ కాదు.. మీరుకూడా ఒక హీరో మాత్రమే. ఇండస్ట్రీ బాగుకోసం చర్చలకి వెళ్లారు. కానీ, ఎవరు భూములు పంచుకోవడానికి వెళ్లారు. మీరు చాలా చాలా తప్పు మాట్లాడారు. మీరు సినీ పరిశ్రమని, తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమానించారు. మీరు కచ్చితంగా సినీ పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాల్సిందే. రియల్ ఎస్టేట్ ఎవరు చేశారు.. అన్నది ఏపీ వెఌతే తెలుస్తోంది. మాటలు మంచిగా మాట్లాడటం నేర్చుకోండి బాలకృష్ణ గారూ.. ” అంటూ నాగ బాబు ఫైర్ అయ్యారు. మరీ.. నాగబాబు వ్యాఖ్యలపై బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుంది ? అన్నది చూడాలి.