కరోనా మరణాలు : చైనాని దాటేసిన భారత్

భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 7466 కేసులు, 175 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 4706కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

ఇక కరోనా మరణాల్లో భారత్ , చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటివరకు 4634 కొవిడ్ మరణాలు సంభవించగా భారత్ లో ఈ సంఖ్య 4706గా ఉండటం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. అంతేకాకుండా కరోనా కేసుల్లోనూ ప్రపంచంలో భారత్ 9వ స్థానానికి ఎగబాకింది. దేశంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతుంటే.. మరోవైపు లాక్‌డౌన్ సడలింపు అంటూ.. అంతా ఓపెన్ చేస్తున్నారు. ఈ ప్రభావంతో రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్.